మ‌హిళా దినోత్స‌వం కానుకగా ప‌సుపు-కుంకుమ

64

మహిళ‌ల శ‌క్తితోనే న‌వ్యాంధ్ర ప్ర‌గ‌తిప‌థంలో ప‌య‌నిస్తోంద‌ని పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్వ‌యంశ‌క్తి సంఘాల ఏర్పాటుతో మ‌హిళా సాధికార‌త‌, ఆర్థిక స్వావ‌లంబ‌న సాధ్య‌మైంద‌న్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళాలోకానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. రాష్ర్ట అభివృద్ధిలో భాగ‌మైన మ‌హిళ‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌సుపు-కుంకుమ కానుక‌గా అందిస్తోంద‌న్నారు. “ప్ర‌తీ పురుషుడి విజ‌యం వెనుక ఒక స్ర్తీ ఉంటుంది“ అనే వారు పెద్ద‌లు. నా అభిప్రాయం మేర‌కు “ప్ర‌తీ మ‌హిళ తాను విజ‌యం సాధిస్తూ…త‌న‌వారిని విజ‌య‌తీరాల‌కు చేరుస్తుంది“. ఇది ముమ్మాటికీ నిజం. మా ఇంటిలో అమ్మ భువ‌నేశ్వ‌రి, నా భార్య బ్రాహ్మ‌ణిలే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌తీ మ‌హిళ త‌న‌కు అందుబాటులో ఉన్న అవ‌కాశాల‌ను వినియోగించుకుని అన్ని రంగాల‌లో అత్యున్న‌తంగా రాణించాల‌ని కోరుకుంటున్నాను.

మీ
నారా లోకేశ్‌
పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖా మంత్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here