‘మ‌జిలీ’ ట్రైల‌ర్ రిలీజ్

210

వీఐపీ, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, నిన్ను కోరి… ఈ సినిమాల స‌ర‌స‌న మ‌జిలీ సినిమాను చేర్చుకోవ‌చ్చు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈరోజు న‌టుడు వెంక‌టేష్ రిలీజ్ చేశారు. *వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరకుతారు* డైలాగు ఇందులో హైలెట్‌. పెళ్లాం మీద ఆధార‌ప‌డి బ‌తికే ఓ భ‌ర్త‌… కొన్ని సంద‌ర్భాల్లో విడిపోయాక జ‌రిగే సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యాల‌ను తీసుకుని నిర్మించిన‌ట్టు ఉంది ఈ సినిమా.
‘ఏ మాయ చేసావే’ చిత్రంలో లవ్లీగా క‌నిపించిన చైతు, స‌మంత‌లు… రియ‌ల్ లైఫ్ క‌పుల్ ఇపుడు. అయితే, తెర‌పై కూడా అలాంటి పాత్ర‌నే పోషించారు. పెళ్లి తరువాత వారిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న చిత్రం ‘మజిలీ’. దీంతో వారి ఎలా ఆక‌ట్టుకోబోతున్నారు అని అంద‌రికీ ఆస‌క్తి ఉంది. అయితే, ఈ ట్రైల‌ర్ చూశాక క‌చ్చితంగా ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంద‌నిపిస్తోంది.
స‌మంత‌తో పాటు దివ్యాన్ష కౌశిక్ ఇందులో మ‌రో హీరోయిన్‌. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు. మ‌రో ఐదురోజుల్లో ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఫంక్ష‌నులో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.
*సిగ్గుండాలిరా.. పెళ్లందగ్గర డబ్బులు తీసుకోవడానికి. తినే తిండి కట్టుకునే బట్ట.. ఆఖరుకి తాగే మందు కూడా భార్య సంపాదన మీదే* వంటి డైలాగులు నేటివిటీకి ద‌గ్గ‌రగా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా తెలుగులో కొత్త ట్రెండ్ అయ్యే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here