‘మోడీ గో బ్యాక్’ అంటూ హోరెత్తించిన ఏపీ

182

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు రావడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేతలందరు తమ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉద్యమంలా జరిగింది. ఏలూరి పిలుపు మేరకు యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వీరందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ‘మోడీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ముందుగా మార్కాపురంలోని గడియార స్థంభం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్దకు నల్లచొక్కాతో చేరుకున్నారు ఏలూరి. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీకి మంచి బుద్దిని ప్రసాదించాలని గాంధీజీని ప్రార్ధించారు..

ఆ తరువాత సమీపంలోనే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక అక్కడే ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఏలూరి ప్రసంగించారు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డుమీదకు చేరుకొని మోడీకి వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి ప్రజలతో కలిసి నిరసన తెలియజేశారు. అనంతరం ప్రసారమాధ్యమాల ప్రతినిధులతో ఏలూరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ద్వారా అభివృద్ధి చెందిన దేశాన్ని మోడీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. నోట్ల రద్దు వలన వచ్చిన ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటిస్తున్నారు.. వాటిని నమ్మవద్దని ప్రజలను కోరారు ఏలూరి. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని దారుణంగా మోసం చేసిన మోడీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చారన్నారు. రెండు నెలలు ఓపిక పడితే దేశానికీ మంచి రోజులు వస్తాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రధాని హోదాలో రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేస్తారని అన్నారాయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here