మోడల్ కోడ్..మోదీ కోడ్‌గా మారింది: కాంగ్రెస్

115

మోదీ-షాలు ఇద్దరూ ఎన్నికల నియమావళిని అనేక సార్లు ఉల్లంగించారు. ఉల్లంగిస్తున్నారు. చట్టాల్ని వారు హేళన చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ అన్నారు.
ఎన్నికల నియామవళికి తూట్లు పొడుస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలపై చర్యలు తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని కాంగ్రెస్ నిలదీసింది. ఈ వ్యవహారం చూస్తుంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్.. మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్‌గా మారిందని వారు ఆరోపించారు.
అయితే ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయించదలుచుకున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల నియమావళి ఉల్లంగనలపై ఈసీ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, అయితే కోర్టు ద్వారానైనా వీటికి అడ్డుకట్ట వేయదలుచుకున్నామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here