మొరాకోలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సందడి

101

0fff00e4ab73140e1a8d5cb74b343d45 a8a937563ca6444514ba4beb9ceb1ad0నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మే 9న మొరాకోలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ సహకారంతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ ‘’మొరాకోలో మూడు వారాల పాటు చిత్రీకరణ జరుపుతాం. హాలీవుడ్ టెక్నిషియన్స్ సహకారంతో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా మొదటి రోజు పూర్తయ్యింది. బాలకృష్ణగారు, కబీర్ బేడిగారు తదితరులు ఈ షెడ్యూల్ లో ఉత్సాహంతో పాలు పంచుకున్నారు. తొలిరోజు సన్నివేశాలు అనుకున్న దానికంటే బాగా రావడంతో చాలా హ్యపీగా ఉన్నాం’’అన్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు,నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here