మొండి వైఖరి విడనాడి 5 కోట్ల ఆంధ్రులకు సంజాయిషీ ఇవ్వండి-మంత్రి జవహర్


రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించకపోవటం బాధాకరమని రాష్ట్ర Excise శాఖ మంత్రి కె.ఎస్. జవహర్ పేర్కొన్నారు. పార్లమెంట్లో ఆంధ్ర ఎంపీలు చేస్తున్న నిరసనకు మంత్రి జవహర్ సంఘీభావం ప్రకటించారు.ఈ మేరకు అమరావతి సచివాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం ఇచ్చిన నివేదికలకు కేంద్రం ప్రకటించిన నిధులకు ఏమాత్రం పొంతన లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి 29 సార్లు దిల్లీ వెళ్లి ప్రధానిని, పలువురు మంత్రులను కలిసి నివేదికలు ఇచ్చారన్నారు. ఐతే 5 సార్లు బడ్జెట్ ప్రకటించినా మిత్ర బంధ ధర్మం కారణంగా ఓపికగా ఉన్నామని వివరించారు.మెట్రోరైలు, రైల్వే జోన్, పెట్రో కారిడార్, అమరావతి నుంచి రాష్ట్ర రహదారులకు కనెక్టివిటీ రోడ్డులు లేకపోవటం బాధాకరమని అన్నారు.ప్రధానంగా 2017-18లో ఎస్సి లకు 52,393 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ. 56 కోట్లతో సరిపెట్టేశారని చెప్పారు.ఇప్పటి వరకు మిత్ర బంధం కారణంగా ఓపిక పట్టిన 5 కోట్ల ఆంధ్రులు రగిలిపోతున్నారని జవహర్ అన్నారు.ఆంధ్ర ఎంపీలకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం ప్రకటించటం పట్ల ప్రతీ ఒక్కరికి కృతజ్ఞత లు తెలిపారు.ఆంధ్రుల మనోభావాలను దెబ్బ తీస్తే ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *