మేలో విడుదల కానున్న"బాహుబలి"

37

bahubali-prabhas-poster-apvarthalu-comతెలుగు సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బాహుబలి సినిమా మొదటి పార్ట్ విడుదల తేదీ ఖరారుచేసుకుంది. మరో వారంలో ఈ సినిమా రిలీజ్  డేట్ రాజమౌళి అధికారికంగా వెల్లడించనున్నాడు. అయితే, మాకందిన సమాచారం ప్రకారం ఆ తేదీ మే రెండో శుక్రవారం గానీ లేదా మూడో శుక్రవారం గానీ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సీన్స్ అన్నీ షూట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా పాటల్లో కొన్నింటిని ఇంకా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోని సెట్లో ప్రభాస్-తమన్నాలపై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ విశేషమే. ఎందుకంటే తెలుగులో నిర్మితమై ప్రపంచంలో తొలిసారి ఎక్కువ దేశాల్లో కొత్త కొత్త దేశాల్లో విడుదల కాబోతున్న సినిమా ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here