మెరుగైన సమాజంకోసం పోరాడుతా..టీవీ9 ర‌విప్ర‌కాష్

120

జ‌ర్న‌లిజంలో ప్ర‌వేశించిన కాంట్రాక్ట‌ర్లు, బిల్డ‌ర్ల లాబీతో త‌న పోరాటం కొనసాగుతుంద‌ని టీవీ 9 వ్య‌వ‌స్థాప‌కుడు ర‌విప్ర‌కాష్ చెప్పారు. హిందుస్తాన్ టైమ్స్ కి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వూలో ఆయ‌న మాట్లాడుతూ .టీవీ 9 నైతిక విలువ‌ల‌కి తిలోద‌కాలిచ్చింద‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. సోష‌ల్ మీడియా త‌న‌పై విషం క‌క్కుతోంద‌ని, జర్న‌లిజంలోని విలువ‌ల‌ను తానుగానీ, త‌న టీమ్ గానీ ఏనాడూ కాల‌రాయ‌లేద‌న్నారు. మెరుగైన స‌మాజం కోసం టీవీ 9లో తాను త‌ల‌పెట్టిన య‌జ్ఞం కొన‌సాగుతుంద‌ని ర‌విప్ర‌కాష్ స్ప‌ష్టం చేశారు. టీవీ 9 యాజ‌మాన్య ప‌గ్గాల‌ను బిల్డ‌ర్లు, కాంట్రాక్ట‌ర్ల లాబీలు దొడ్డిదారిన చేజిక్కించుకుంద‌ని అన్నారు. కొత్త యాజ‌మాన్యం అధికారుల‌కు, హ‌క్కుల‌కు తాను ఏ నాడు అడ్డు త‌గ‌ల‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. మెజార్టీ షేర్ హోల్డ‌ర్లు మైనార్టీ షేరు వున్న తాను వారి ప్ర‌య‌త్నాన్ని అడ్డుకున్నాన‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. త‌న మీద చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అబ‌ద్దాల‌ని ఆధార ర‌హితాల‌ని త‌న ప్ర‌తిష్ట‌ను కించ‌ప‌రిచేందుకే చేస్తున్నార‌ని ఆరోపించారు. మీడియా వ్య‌వ‌స్థ నుంచి త‌న‌ను బ‌ల‌వంతంగా నెట్టివేసే ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కావ‌ని, త‌న‌ను ఎవ‌రూ దూరం చేయ‌లేర‌ని అన్నారు. యాజ‌మాన్యం బ‌ద‌లాయింపు అగ్రిమెంట్ల‌కు తానే ప్ర‌త్య‌క్ష సాక్షిన‌ని, త‌న‌కు మైనార్టీ షేర్లు వున్నా తానే ఫౌండ‌ర్ చైర్మ‌న్ గా, సీఈవోగా కొన‌సాగాల‌ని ఒప్పందం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here