ముఫ్ఫై వసంతాలు పూర్తిచేసుకొన్న ‘అత్తకుయముడు అమ్మాయికిమొగుడు’

129

చిరంజీవి నటించిన 104వ చిత్రం. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన 14వ చిత్రం. చిరంజీవి, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన 21వ చిత్రం.చిరంజీవి హీరోగా అల్లు అరవింద్ నిర్మించిన 7వ చిత్రం. ఈచిత్రంతో వాణీశ్రీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈచిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. 41కేంద్రాలలో 50రోజులు, 14కేంద్రాలలో 100రోజులు ప్రదర్శించబడింది. ఈచిత్ర శతదినోత్సవ వేడుకలు 1989 జూన్ 4వ తేదీన రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈచిత్రాన్ని తమిళంలో రజనీకాంత్ హీరోగా ‘మాపిళ్ళై’ పేరుతో, హిందీలో అనిల్ కపూర్ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘జమైరాజా’ పేరుతో పునర్నిర్మించారు. ఈ రెండు చిత్రాలు కూడా విజయం సాధించాయి. తమిళ చిత్రంలో రజనీకాంత్ స్నేహితులలో ఒకరిగా చిరంజీవి చిన్నపాత్ర చేశారు. తమిళంలో తనే సొంతంగా సంభాషణలు చెప్పారు చిరంజీవి.

అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈచిత్రంలోని పాటలు
1. దిగు దిగు దిగు భామ ఆ ప్రేమ లోతెంతో చూద్దామా – వేటూరి సుందరరామమూర్తి
2. మెరుపులా లాలా ఆడతా తాతా పిడుగులా లాలా రేగుతా తాతా – భువనచంద్ర
3. కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిగే గాలికి కౌగిలి పట్టు – వేటూరి సుందరరామమూర్తి
4. టింగురంగ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో – వేటూరి సుందరరామమూర్తి
5. శాంతి ఓం శాంతి అరె ఖైదీ పోయేదారేది – వేటూరి సుందర రామమూర్తి
గీతాఆర్ట్స్ పతాకంపై వచ్చిన ఈ చిత్రంలో ముఖ్యతారాగణం : చిరంజీవి, విజయశాంతి, వాణిశ్రీ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, సుధాకర్, గిరిబాబు, బ్రహ్మానందం, ప్రసాద్ బాబు, అరుణ్ కుమార్, అన్నపూర్ణ, వరలక్ష్మి, ముచ్చర్ల అరుణ, బిందుఘోష్, ప్రియాంక, సుత్తివేలు తదితరులు నటించారు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎ. కోదండరామి రెడ్డి
నిర్మాత : అల్లు అరవింద్
సంగీతం : చక్రవర్తి
సినిమాటోగ్రఫీ : లోక్‌సింగ్
ఎడిటింగ్ : వెళ్ళైస్వామి
కథ, మాటలు : సత్యానంద్
సాహిత్యం : వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర
నేపథ్య గానం : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, యస్. జానకి
చిత్రనిడివి : 132 నిమిషాలు
విడుదల తేదీ : 14 జనవరి 1989

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here