మీడియాను వాడుకుని వదిలేయడంలో రాజమౌళి

41

SS-Rajamouliఎస్ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరరెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి’ ఈనెల 10న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రాజ‌మౌళి ఎంతో క‌ష్ట‌ప‌డి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమా విడుదలకు ముందు మీడియా నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. బాహబలి ప్రమోషన్లు, ఇంటర్వూలు ఇతర కార్యక్రమాల‌కు కొన్ని మీడియా సంస్థ‌ల‌ను మాత్ర‌మే జ‌క్క‌న్న టీం పిలిచి…వారికే ఇంట‌ర్వ్యూలు ఇచ్చింద‌ని…త‌మ‌ను పట్టించుకోలేదంటూ కొన్ని సంస్థ‌ల మీడియా ప్ర‌తినిధులు రాజ‌మౌళి ముందే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టాప్ పత్రికలను అలాగే టాప్ చానెళ్లు, టాప్ వెబ్ సైట్ల ను మాత్రమే పిలుస్తున్నారు. ఆంధ్రభూమి, సూర్య, ఆంధ్ర ప్రభ, వార్త ఇంకా ఇలాంటి అనేక పత్రికలను పక్కన పెట్టేసారు. అయితే మంగ‌ళ‌వారం పైర‌సీకి యాంటీగా నిర్వ‌హించిన ప్రెస్‌మీట్ కు మాత్రం అందర్నీపిలిచారు. మీకు అవ‌స‌రం ఉంటే మ‌మ్న‌ల్ను పిలుస్తారా …ప్ర‌మోష‌న్స్‌కు మేం అవ‌స‌రం లేదా అంటూ మిగిలిన మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు రాజమౌళి ను నిల‌దీశారు. దీంతో చిత్ర నిర్మాత‌లు రెండు రోజుల నుంచే ప్రమోషన్లు ప్రారంభించామని,అందరికీ అవకాశం ఇస్తామని చెప్పేందుకు ప్ర‌య‌త్నించారు. అయినా చాలా మంది విన‌లేదు. సినిమా తేడా వ‌స్తేనే మ‌ళ్లీ తాము అవ‌స‌ర‌మ‌వుతామ‌ని మీడియా ప్ర‌తినిధులు చిత్ర టీం ఎదురుగానే కామెంట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here