మాస్కులు ధరించకుండా తిరిగితే జరిమానా

96

కర్నూలు జిల్లాలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కరోనా వైరస్ మహమ్మారి పై తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించకుండా, మాస్కులు ధరించకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,086 మందిపై కేసులు నమోదు చేసి, రూ. 5,77,350 జరిమానా విధించారని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనాకట్టడిలో భాగంగా మాస్కులు ధరించకుండా రహదారులపై నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై జిల్లా పరిధిలో జూన్ 24 నుండి నిన్నటి వరకు అనగా జూలై 4 వరకు ఈ కేసులను నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

పట్టణ ప్రాంతాలలో మాస్కులు లేకుండా వాహనం నడిపితే రూ. 100, గ్రామీణ ప్రాంతాలలో అయితే రూ. 50 జరిమానా విధించడం జరుగుతుందన్నారు.

ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి కరోనా వ్యాప్తి నివారణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి వాటిని పాటించి జిల్లా పోలీసు యంత్రాంగానికి సహాకరించాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here