మార్చి లో ఏపీ మెట్రో డిజైన్‌ పూర్తి

sreedharan-apvarthalu-comఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టు డిజైన్‌ మార్చి చివరినాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు సలహాదారు శ్రీధరన్‌ తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు అధిక వ్యయం అవుతుందనే కారణంగా గుంటూరు, తెనాలి, విజయవాడ మధ్య హైస్పీడ్‌ సబర్బన్‌ రైల్వే కారిడార్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఈ ప్రతిపాదనలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని శ్రీధరన్‌ పేర్కొన్నారు. విజయవాడలో మెట్రో ప్రాజెక్టు కోసం రెండు కారిడార్లను గుర్తించామని, వాటికోసం భూసార పరీక్షలు జరుగుతున్నాయని, మార్చి చివరినాటికి డిజైన్‌ పూర్తవుతుందని శ్రీధరన్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *