మహా సముద్రాలను చుట్టివచ్చిన స్వాతికి సీఎం సత్కారం!

58

కేవలం ఎనిమిది నెలల్లో తెరచాప పడవలో సముద్రాలను చుట్టివచ్చిన ధీర నావికాదళ మహిళా బృందంలో సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ కి చెందిన లెఫ్టనెంట్ కమాండర్ పాతర్లపల్లి స్వాతిని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్కరించారు. ‘నావికా సాగర్‌ పరిక్రమ’ పేరిట ఆరుగురు నావికాదళ మహిళాధికారులు గత ఏడాది సెప్టెంబరు 10న సాహస యాత్రను ప్రారంభించి మే 21న తిరిగి గోవాకు చేరుకున్నారు. వారిలో సాహసంవంతంగా ప్రయాణం చేసి వచ్చిన పాతర్లపల్లి స్వాతి ముఖ్యమంత్రి ని కలిశారు. ఆమె చేసిన సాహసం యువతకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.
విశాఖపట్నానికి చెందిన స్వాతి తన అనుభవాలను వివరించారు. ఆమె చేసిన ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతికూల వాతావరణంలో చాల కష్టసాధ్యమైన యాత్ర చేపట్టిన మహిళా బృందంలో విశాఖపట్నానికి చెందిన స్వాతి ఉండడం గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, స్వాతి సేవలు తగు విధంగా వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె కు ప్రభుత్వం తగు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here