మరో 12 కంపెనీలు..సిద్ధంగా 1300 ఉద్యోగాలు.!

రాష్ట్రంలో మరో 12 చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఈ నెల 17న వీటిని ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ రాజధాని ప్రాంతంలోనే వస్తున్నాయి. మంగళగిరి సమీపంలోని ఏపీ ఎన్‌ఆర్‌టీ టెక్‌పార్కులో 9 కంపెనీలు, మంగళగిరిలోని పైకేర్‌ ఐటీ పార్కులో మరో మూడు కంపెనీలు ఏర్పాటవుతున్నాయి.

ఇవన్నీ ఏపీ ఎన్‌ఆర్‌టీ సంస్థ చొరవతో వస్తున్న కంపెనీలు. వీటిలో 90 శాతం అమెరికా కంపెనీలు, బ్రిటన్‌కు చెందినవి ఒకటి రెండు, మన దేశంలో వేరే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ ఒకటి ఉన్నాయని ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు రవి వేమూరి తెలిపారు. ఈ కంపెనీలు రావడంతో తక్షణం 5-6 వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెట్టాక సుమారు 1300 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ 12 కంపెనీలతో కలిపి ఇంత వరకు ఏపీ ఎన్‌ఆర్‌టీ ద్వారా రాష్ట్రానికి వచ్చిన కంపెనీల సంఖ్య 53కి చేరినట్టు ఆయన తెలిపారు. వీటిలో ఎక్కువ కంపెనీలు విశాఖ, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో ఏర్పాటైనట్టు ఆయన వెల్లడించారు. మరో 20 వరకు కంపెనీలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *