‘మజ్ను’ నా సినిమా అని చెప్పుకోవడం గర్వంగా ఉంది- నాని

75

naniవరుస హిట్స్‌తో ముందుకు దూసుకెళ్తున్న హ్యాట్రిక్‌ హీరో నాని ‘మజ్ను’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘అంత:పురం’, ‘ఒకరికొకరు’, ‘నువ్వు నేను’ రీసెంట్‌గా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘బీరువా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేత పి.కిరణ్‌ కేవ మూవీస్‌ అధినేత్రి గీత గొల్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మజ్ను’. హను ఇమ్మాన్యుయేల్‌, ప్రియ హీరోయిన్స్‌గా ‘ఉయ్యాల జంపాల’ ఫేం విరించివర్మ దర్శకత్వంలో రూపొందిన ‘మజ్ను’ చిత్రం సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా ఏసియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా రిలీజ్‌ అవుతోంది. సూపర్‌హిట్‌ చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపిసుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవల విడుదలై శ్రోతల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆడియో సక్సెస్‌ మీట్‌ను సెప్టెంబర్‌ 20న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, హీరోయిన్‌ హను ఇమ్మానుయేల్‌, దర్శకుడు విరించివర్మ, మాటల రచయిత మిర్చి కిరణ్‌, ఏసియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌, కమెడియన్‌ సత్య, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ సంతోషి లంక, నిర్మాతలు పి. కిరణ్‌, గీత గొల్ల పాల్గొన్నారు.
చిత్ర దర్శకుడు విరించివర్మ మాట్లాడుతూ – ”నా రెండో సినిమా నానితో చేయడం లక్కీగా భావిస్తున్నాను. అలాగే ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ వంటి బిగ్‌ బ్యానర్‌లో నా రెండో సినిమా చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కథ విని కిరణ్‌గారు బాగా ఇంప్రెస్‌ అయి నాని దగ్గరకు తీసుకెళ్లి కథ చెప్పించారు. నాని కూడా చాలా ఎగ్జైట్‌ అయి సినిమాని వెంటనే ఓకే చేశారు. కేవ మూవీస్‌ గీతగారు ఫస్ట్‌ నుండి లాస్ట్‌ వరకు ఫ్రెండ్‌లా ట్రీట్‌ చేస్తూ ఎంతో సపోర్ట్‌ చేసినందుకు చాలా థాంక్స్‌. గోపిసుందర్‌ సబ్జెక్ట్‌ విని ఇంప్రెస్‌ అయి ఎక్స్‌లెంట్‌ ట్యూన్స్‌ ఇచ్చారు. రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, రాంబాబు గోసాల మంచి లిరిక్స్‌ రాశారు. నేను రాసుకున్న కథని విజువల్‌గా అద్భుతంగా తీసి సినిమాని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ రిచ్‌ లొకేషన్స్‌ని సెలక్ట్‌ చేశాడు. నానితో సినిమా చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది” అన్నారు.
కమెడియన్‌ సత్య మాట్లాడుతూ – ”ప్రస్తుతం నాని సినిమాలు హాట్‌కేక్‌లా వుంటున్నాయి. పిల్లల దగ్గర్నుండి ముసలి వారు వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నాని సినిమాలు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో నాని ఫ్రెండ్‌గా ఇంపార్టెంట్‌ రోల్‌ చేశాను. నాచురల్‌గా బిహేవ్‌ చేస్తుంటాడు. విరించివర్మ ప్రతి సీన్‌ని ఫెంటాస్టిక్‌గా తీశాడు. నాని ఎన్నో సలహాలు ఇచ్చారు. కిరణ్‌గారు, గీతగారి ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చాలా బాగున్నాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నానికి సెకండ్‌ హ్యాట్రిక్‌ హిట్‌ అవుతుంది” అన్నారు.
లిరిక్‌ రైటర్‌ రాంబాబు గోసాల మాట్లాడుతూ – ”ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌లో పాట రాయడం చాలా హ్యాపీగా ఉంది. ‘ఉయ్యాల జంపాల’లో పాటలు రాశాను. మళ్లీ విరించివర్మ ఈ చిత్రానికి అవకాశం ఇచ్చారు. ‘జారే.. జారే’ పాట ఈ చిత్రంలో రాశాను. ఈ పాట మంచి హిట్‌ అయి నాకు చాలా మంచి పేరుతెచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన కిరణ్‌గారికి, గీతగారికి నా థాంక్స్‌. ఆడియోని హిట్‌ చేసినట్లే సినిమాని కూడా పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ – ”మజ్ను’ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా హయ్యస్ట్‌ నెంబరాఫ్‌ థియేటర్లలో సెప్టెంబర్‌ 23న రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ వసూలు చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్‌ హను ఇమ్మానుయేల్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో నటించాను. విరించివర్మ టాలెంటెడ్‌ డైరెక్టర్‌. ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్‌గా ప్రజంట్‌ చేశారు. ‘జారే జారే’ నా ఫేవరెట్‌ సాంగ్‌. అన్ని పాటలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. కిరణ్‌గారి బ్యానర్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది” అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ – ”విరించివర్మ వచ్చి ‘ఉయ్యాల జంపాల’ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కానీ ఇది కొత్త వాళ్లతో చేస్తే బాగుంటుందని విరించికి చెప్పాను. అతన్ని చూడగానే నాకు బాగా నచ్చాడు. అప్పుడే ఫిక్స్‌ అయ్యాను విరించివర్మతో ఒక సినిమా చేయాలని. అతను ఫస్ట్‌ ‘వెన్నెల’ అనే ఒక క్యూట్‌ షార్ట్‌ ఫిలిం తీశాడు. న్యూ కాన్సెప్ట్‌తో చాలా బాగా తీశాడు. తర్వాత కిరణ్‌గారు, గీతగారు విరించివర్మను తీసుకొచ్చి కథ చెప్పారు. బాగా నచ్చింది. చాలా ఎగ్జైట్‌ అయ్యాను. నాకు ఎప్పటి నుంచో లవ్‌స్టోరీస్‌ చేయాలని ఉంది. కథ విన్నాక 150 శాతం ఈ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాను. నిజంగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ చేశామో, ఎప్పుడు ఫినిష్‌ అయిందో తెలియకుండా కంప్లీట్‌ అయింది. సినిమా చేసేటపుడు హాయిగా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. ఫైనల్‌ రిజల్ట్‌ చూశాక టు హండ్రెడ్‌ పర్సెంట్‌ విరించివర్మ న్యాయం చేశాడు అనిపించింది. చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యాను. ‘మజ్ను’ ఇది నా సినిమా అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సినిమా చూసి ఆడియన్స్‌ చాలా ఇంప్రెస్‌ అవుతారు. ఏ లెక్కలు వేసుకోకుండా సింపుల్‌గా తన మనసులో ఉన్న కథని అందంగా చూపించాడు. సినిమా చేసేటప్పుడు స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఒక స్మైల్‌ ఉంటుంది. తెలియని ఒక హానెస్ట్‌, సింప్లిసిటీ ఉంది. ఈ చిత్రంలో ఫస్టాఫ్‌లో నాలుగు పాటలుంటాయి. ఈమధ్య కాలంలో ఏ సినిమాలో లేవు. పాటలన్నీ కథలో భాగంగానే ఉంటాయి. గోపిసుందర్‌ అవుట్‌ స్టాండింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. లవ్‌స్టోరీ కామెడీ, ఎమోషన్స్‌తో పాటు ఒక అందమైన కథ చెప్పాలనే ప్రయత్నం చేశాం. నా సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నా సినిమా చూస్తారు. ‘మజ్ను’తో అది డబుల్‌ అవుతుంది. కంప్లీట్‌గా కుటుంబం అంతా చూసి ఎంజాయ్‌ చేయగల సినిమా ఇది. జ్ఞానశేఖర్‌ ఫొటోగ్రఫి, గోపిసుందర్‌ మ్యూజిక్‌, విరించివర్మ టేకింగ్‌, మిర్చి కిరణ్‌ డైలాగ్స్‌ ఈ సినిమాకి మెయిన్‌ హైలైట్స్‌. సత్య నా ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో చాలా చాలా ముఖ్యమైన పాత్ర చేశాడు. మంచి పాటలు రాసిన లిరిక్‌ రైటర్స్‌కి నా థాంక్స్‌. ‘మజ్ను’ హండ్రెడ్‌ పర్సెంట్‌ హిట్‌ కాబోతోంది. అది ఏ రేంజ్‌ హిట్‌ అనేది ప్రేక్షకులే చెప్పాలి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా థాంక్స్‌” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here