భూ-సేవ, ఇ-ప్రగతిపై సచివాలయంలో సీఎం సమీక్ష

99

ప్రభుత్వ సేవలకు, సమస్త సమాచారానికి వేదిక ‘ఇ-ప్రగతి’ పోర్టల్‌ . ఉద్యోగులు, ప్రజలు, వ్యాపారులు, విద్యార్ధులు ఇలా అందరికీ ఉపయోగకరంగా వుండాలి. వివాహ నమోదు పత్రాలు, భూసార పరీక్ష కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు ఇకపై ఆన్‌లైన్‌లో జారి చేయాలి.

కాగితం అవసరంలేని పాలనా వ్యవస్థ రావాలి. ఈ జూన్ నుంచి వివిధ శాఖల్లో దశలవారీగా ‘ఇ-ప్రగతి’ అమలు. ‘ఇ-పథకం’ పేరుతో ప్రతి దశలో పథకాల ట్రాకింగ్ జరిపాలి.

‘ఇ-ప్రగతి’ పోర్టల్ ద్వారా పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖల్లో 8 వేల మంది ఉద్యోగులకు ఎం-బుక్, ఆర్ధిక సేవలు, పాఠశాల-ఇంటర్మీడియేట్ విద్యను అభ్యసిస్తున్న 10 లక్షల మంది విద్యార్ధుల అడ్మిషన్లకు సంబంధించిన సేవలు,

వ్యవసాయ మార్కెటింగ్‌లో 25 వేల మంది వ్యాపారులకు లైసెన్సులు అందించేలా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. రవాణా శాఖలో ప్రస్తుతం అందిస్తున్న 14 సేవలను ఇందులో అనుసంధానిస్తున్నట్టు తెలిపిన ఆయా శాఖల అధికారులు.

విద్యాశాఖలో సంపూర్ణంగా ‘ఇ-ప్రగతి’ని ప్రవేశ పెట్టాలి. రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యాసంస్థల నమోదు, కొత్త విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు, విద్యార్ధులకు సంబంధించి అన్ని సర్టిఫికెట్ల జారీ, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి గృహాలు వంటి అంశాలను ఇ-ప్రగతిలోకి తీసుకురావాలి. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో భూ-సేవ ప్రాజెక్టు
భూమికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ఏకతాటిపై తీసుకురావటం లక్ష్యం
భూ సంబంధిత సేవలను సులభతరం చేయడం పథకం ముఖ్య ఉద్దేశాలు
ప్రతి భూ కమతానికీ, పట్టణ ఆస్తులకు , పంచాయతీలో ఆస్తులకు ఒక విశిష్ట సంఖ్య కేటాయింపు

11 అంకెల సంఖ్య భూధార్
తాత్కాలిక భూధార్, శాశ్వత భూధార్ అనే రెండు దశల్లో భూధార్ సంఖ్య కేటాయింపు
రెవెన్యూ, పురపాలక, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, అటవీ శాఖల అనుసంధానం. భూ యజమానులకు అందుబాటులోకి రానున్న 20 సేవలు మే 30 నాటికి కృష్ణా జిల్లా అంతటికీ, అక్టోబర్ 2 వ తేదీ కల్లా రాష్ట్రమంతా భూ-సేవ ప్రాజెక్టు సేవలు భూ యాజమాన్య మార్పిడిలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా, ఆస్తుల పరిరక్షణకు భూధార్ సేవలు.
భూధార్ కేటాయింపు, భూధార్ నవీకరణ, భూ ప్రాథమిక సమాచారం, ముందుస్తు భూ సమాచారం, పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లో భూ యాజమాన్య మార్పిడి,ఆథరైజేషన్ సేవ, వ్యవసాయేతర ఉపయోగాలకు భూ మార్పిడి, ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్, ధృవీకరించిన లేఔట్స్ సమాచారం, పట్టణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు భూమి విలువల మదింపు,పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాల నిర్వహణ, మోనిటరింగ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, అటవీ హక్కుల రికార్డుల సమాచారం. అటవీ సరిహద్దు వివాదాల తీర్మానం, డీడ్స్ కు సంబంధించి ప్రత్యేకించిన సమాచారం. భూ-సేవ ద్వారా రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములకు, 50 లక్షల పట్టణ ఆస్తులకు, 85 లక్షల గ్రామీణ ఆస్తులకు భూధార్ కేటాయింపు జరుగుతుంది. ఎక్కడా ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా నీతివంతమైన పాలన అందించడం తమ ధ్యేయం ముఖ్యమంత్రి. అందుకు టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధార్ మాదిరిగానే భూధార్ తీసుకొచ్చాం.
జియో ట్యాంగింగ్ వ్యవస్థ ద్వారా భూధార్‌ను తీసుకొస్తున్నాం. భూములు, ఆస్తుల లావాదేవీల్లో అక్రమాలకు ఇక ఆస్కారం ఉండదు. భూములు కొన్నా, విక్రయించినా ఆటోమేటిక్ గా లావాదేవీలు జరుగుతాయి. గతంలోలా ఆఫీసులకు వెళ్లి అసహనానికి గురయ్యే పరిస్థితి భవిష్యత్తులో అవసరం లేదు. ఇప్పటికి 25 సర్వీసులు ఆన్‌లైన్ లో ఉంచాం. రానున్న రోజుల్లో మన ముంగిటకు మరింత విస్తృతంగా టెక్నాలజీ వస్తుంది. భూ రికార్డుల నిర్వహణ విషయంలో ప్రజల్లో ఇప్పటివరకూ ఉన్న అపోహలు, అనుమానాలు తొలగిపోవాలి. సాంకేతికత సహకారంతో తమ భూమి రికార్డులు టాంపర్ కాకుండా భద్రంగా ఉంటాయన్న నమ్మకం కలిగించాలి. భూ-సేవ ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు దీని ద్వారా దేశవ్యాప్తంగా మనరాష్ట్రానికి ఖ్యాతి లభిస్తుంది. సమీక్షలో పంచాయితీ రాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్, ఐటీ సలహాదారు జె సత్యనారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యెక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇ-ప్రగతి సీఈవో ఎన్ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here