భూమా’ మృతితో ఏపీ బడ్జెట్‌ వాయిదా!

13

andhrapradesh1నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి అకాల మరణం పట్ల సోమవారం ప్రవేశపెట్టాల్సిన రాష్ట్ర బడ్జెట్ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి కె. సత్యనారాయణ ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రకటనను విడుదల చేశారు. భూమా నాగిరెడ్డి మృతికి సంతాప సూచకంగా రేపు అసెంబ్లీ, శాసనమండలికి సెలవు ప్రకటించామన్నారు. మంగళవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ఉంటుందన్నారు. అలాగే బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీపై ఎల్లుండి బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here