"బ్రూస్‌ లీ" రిలీజ్‌ చేయటం న్యాయమా!

Bruce-Lee-Movie-StillsLatest-Stills-of-Charans-Bruce-Lee-3Producer Tummalapalli Rama Satyanarayana @ Affair Song Teaser Launch Stillsగౌరవనీయులైన మెగాస్టార్‌ చిరంజీవి అన్నయ్యగారికి,

మీ అభిమాని, నిర్మాత తుమ్మపల్లి రామసత్యనారాయణ నమస్కరించి వ్రాయునది. గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్‌టిఆర్‌, ఎఎన్‌ఆర్‌ రెండు కళ్లు అనే వారు. తదుపరి తరంలో మీరే మా ఫిలిం ఇండస్ట్రీకి మెగా దిక్కు. గతంలో మీరు సంవత్సరానికి మూడు లేక నాలుగు సినిమాలు చేసేవారు. రాజకీయాల వల్ల మాకు మీరు 10 సంవత్సరాలు దూరం అయ్యారు. మీరు మళ్లీ యాక్ట్‌ చేస్తుంటే మా అందరికీ పండుగ వాతావరణంలా వుంది. ఇటీవల ‘బాహుబలి’ చిత్రం విడుదలైన వారానికే ‘శ్రీమంతుడు’ విడుదల కావాల్సి ఉంది. కానీ మహేష్‌బాబు ఇండస్ట్రీ శ్రేయస్సు కోరి 100 కోట్ల సినిమా బతకాలంటే 4 వారాల గ్యాప్‌ కావాలని ‘శ్రీమంతుడు’ సినిమాని నాలుగు వారాలు పోస్ట్‌పోన్‌ చేయించారు. ఆగస్టు 15న విడుదల కావల్సిన ‘కిక్‌`2’ నిర్మాతతో మాట్లాడి ఆ సినిమాను కూడా ఒక వారం వెనక్కి పంపించారు. అలాంటిది గుణశేఖర్‌లాంటి దర్శకుడు నిర్మాతగా మారి చారిత్రాత్మకమైన ‘రుద్రమదేవి’ సినిమాను 65-70 కోట్ల వ్యయంతో మూడు సంవత్సరాల పాటు అహర్నిశులు కష్టపడి తన సొంత ఆస్తులను కూడా తాకట్టుపెట్టి తెలుగోడు గర్వించదగ్గ సినిమాను తీశారు.
ఎప్పుడో దాసరి నారాయణరావు గారు ‘తాండ్రపాపారాయుడు’లాంటి హిస్టారికల్‌ సినిమా తీశారు. దాని తర్వాత వచ్చే గొప్ప హిస్టారికల్‌ సినిమా ఇదే. ఈ సినిమాకు ప్రత్యేక అలంకారంగా మీ ఫ్యామిలీ హీరో బన్నీ పారితోషికం లేకుండా నటించాడు. మీరు కూడా ఈ సినిమాపై అపారమైన నమ్మకంతో వాయిస్‌ ఓవర్‌ చెప్పి సినిమా వాల్యూని పెంచారు. కానీ ఇప్పుడు అనేకసార్లు వాయిదాుపడి ఎట్టకేలకు 9వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడు రావాలంటే మినిమం మూడు లేదా నాలుగు వారాు గ్యాప్‌ కావాలి. కానీ మీరు ప్రత్యేక పాత్రలో నటించిన, రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘బ్రూస్‌లీ’ సినిమా16వ తేదీన ఎందుకు విడుదల చేయాలి. ‘రుద్రమదేవి’లాంటి సినిమా బతికితే గుణశేఖర్‌లాంటి దర్శకు మరిన్ని మంచి హిస్టారికల్‌ సినిమాలు తీస్తారు. మీ సినిమా మీదే మీ సినిమా రిలీజ్‌ చేయటం న్యాయమా! ఆలోచించండి. మీరే పెద్దరికం తీసుకుని పెద్ద మనసుతో ఆలోచించి ఇండస్ట్రీకి మెగా హీరోగా నిలవాలని నా కోరిక.
‘బ్రూస్‌లీ’ సినిమాలో మీరు కూడా నటించడం వల్ల ఆ సినిమాకి ప్రత్యేకమైన గ్లామర్‌ వచ్చింది. మీ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అయితే అప్పుడే పండుగ. దసరాకి మీరు రిలీజ్‌ చేయవసిన అవసరం లేదు. కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించండి. కేసీఆర్‌ గారు తెంగాణ సంస్కృతికి కట్టుబడి టాక్స్‌ ఫ్రీ ఇచ్చారు. మీరు కూడా ఏపీ గవర్నమెంట్‌తో మాట్లాడి ఏపీలో కూడా టాక్స్‌ ఫ్రీ ఇప్పించి ఇండస్ట్రీ పెద్దగా మీరు నడుంకట్టండి. మళ్లీ మెగా హవా చూపండి. మీరు గతంలో లాగా ఏడాదికి మూడు లేదా నాలుగు సినిమాలు చేసి ఈ యంగ్‌ హీరోలందరికీ ఆదర్శంగా నిలవండి. ఇండస్ట్రీ శ్రేయస్సు దృష్ట్యా ‘బ్రూస్‌ లీ’ చిత్రం విడుదలను పోస్ట్‌పోన్‌ చేయండి. ఇది నా సలహా, సూచన.
ప్రేమతో…
మీ అభిమాని
(తుమ్మలపల్లి రామసత్యనారాయణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *