బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కంభంపాటి

ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కంభంపాటి హరిబాబును జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషా ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రానికి ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. అధ్యక్ష పదవి కోసం బీజేపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.

నలుగురి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. సోమువీర్రాజు, మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి ఈ నాలుగు పేర్లు జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు ఆకుల సత్యనారాయణ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఐదుగురిలో ఒకరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికే అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సామాజిక వర్గాల ఆధారంగానే అధ్యక్ష పదవి ఎంపిక జరుగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని కూడా నియమించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *