‘బాహుబలి’ బ్లాక్ టిక్కట్ల దందా..!

83

బాహుబలి ఈనెల 10వ తేదీన రిలీజ్ అవుతోంది. దాంతో మల్టీప్లెక్స్ ల్లో  ‘బాహుబలి’ బ్లాక్ టిక్కట్ల దందా మొదలైంది. మొదటి మూడురోజుల  టిక్కెట్లన్నింటినీ బ్లాక్ చేసేసి… బ్లాక్ లో టిక్కట్లు అమ్మించేందుకు డిస్ట్రిబ్యూటర్లు పన్నాగం పన్నారు. దీన్ని పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఏమంటే… ఆ హీరో ఇన్ని టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు… ఈ హీరో ఇన్ని చేసుకున్నాడంటూ… మొత్తానికే ఎసరు పెట్టేశారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆబ్లిగేషన్ అంటూ… ఆన్ లైన్ టిక్కెట్లన్నింటినీ బుకింగ్ లో దొరకనీయకుండా చేసేశారు. దాంతో ఎంతో ఆశగా ఆన్ లైన్ లో టిక్కెట్టు కొనుక్కొని సినిమా చూద్దామనుకున్న సినీ ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.  హైదారాబాద్ నగరంలోని మల్టీప్లెక్స్ థియేటర్లోని ఒక్కో టిక్కెట్టును రూ.800 నుంచి రూ.1000 వరకు బ్లాక్ లో అమ్మిస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఎప్పుడైనా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఆన్ లైన్ బుకింగ్ వుంటుంది.  కానీ ‘బాహుబలి’ విషయంలో అది ఎక్కడా పాటించడం లేదు. నైజాం ఏరియాలో రూ.22 కోట్లకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. ఆ మొత్తాన్ని తొలి మూడు రోజుల్లోనే రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ‘బ్లాక్ టిక్కెట్ దందా’కు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది.  మల్లీప్లెక్స్ థియేటర్ల దందా ఇలా  నిరాటంకంగా సాగిస్తున్నా దాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదో పెద్ద వ్యాపారంగా మారింది. ప్రేక్షకుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి ‘బాహుబలి’ సినిమాను అన్ని విధాలా వాడుకుని సొమ్ము చేసుకుంటున్నారు. పేరెన్నికగన్న మల్లీప్లెక్స్ థియేటర్లే ఇలా బ్లాక్ టిక్కట్లకు అస్కారం ఇస్తే… ఇక సాధారణ థియేటర్ల సంగతి సరేసరి.

మల్టీప్లెక్స్ థియేటర్లతో పాటు సాధారణ థియేర్ లలో కూడా ఒక్కో షోకు పెద్ద మొత్తంలో వెల కట్టేసి ప్రైవేటు వ్యాపారులకు అమ్మేశారు. ఆ షోను నిర్వహించే వారు భారీ మొత్తంలో టిక్కెట్లను విక్రయిస్తున్నారు.  యూత్ లో ప్రభాస్ కి విపరీతమైన ఫాలోయింగ్ వుండటంతో… చేసేది లేక బ్లాక్ లోనే టిక్కట్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడంది. సాధారణ థియేటర్లలో కూడా టిక్కెట్టు ధర రూ.500కు పైగా అమ్ముతున్నారు. ఇక బెనిఫిట్ షో.. గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇది ఇంకా పెద్ద ‘బ్లాక్ మార్కెట్’లా తయారైంది. 9వ తేదీ అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలను అర్గనైజ్ చేస్తున్న కొంత మంది … ఒక్కో టిక్కెట్టు ధర రూ.2000 నుంచి రూ.4000ల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.  దాదాపు 95 శాతం థియేటర్లన్నీ… బాహుబలి  సినిమాని ప్రదర్శించడానికే సిద్ధమయ్యాయి. దాంతో అందిన కాడికి దండు కుందామనే ఉద్దేశంతో  ఇలా బ్లాక్ లో టిక్కెట్లను అమ్మించడానికి డిస్ట్రిబ్యూటర్లే… కొంత మంది ఏజెంట్లను పెట్టినట్టు అమ్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ దందా అధికారులకు కనబడుతోందో లేదో గానీ… అసలు టిక్కెట్టు ధర మల్లీప్లెక్స్ లో రూ.150 నుంచి రూ.250 వరకు వుంది. దాని ప్రకారమే ప్రభుత్వానికి వినోదపు పన్ను కడతారు. మిగతాదంతా… బ్లాక్ టిక్కట్ల విక్రయదారుల జేబులోకే వెళుతుంది.  ఇలా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ… ప్రేక్షకుల జేబును గుల్ల చేస్తున్న ‘బాహుబలి’ బ్లాక్ టిక్కెట్ల దందాపై అధికారులు దృష్టి సారిస్తే మంచిదని సగటు సినీ అభిమాని ఆశ.పైరసీపై పెదవి విప్పే సినీ పెద్దలు కూడా ఇలాంటి బ్లాక్ టిక్కెట్ల దందాను చూసి ఎందుకు ఊరకే ఉన్నారో అర్ధం కావడం లేదు. ఇంత భారీ మొత్తంలో బ్లాక్ లో టిక్కట్లు అమ్ముతున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారో వారికే తెలియాలి. ఇలాచేస్తే.. పైరసీని ప్రోత్సహించొద్దు… ప్రోత్సహించొద్దు అని మైకు ముందు మొత్తుకున్నా… వాటివైపు ప్రేక్షకులు ఎలా చూడకుండా వుంటారు.. ఇలా వేలల్లో టిక్కెట్ ధరలు పెట్టి అమ్మితే అంత ధర పెట్టలేకనే వారు… మార్కెట్టులో రూ.50కి  దొరికే పైరసీ సీడీని చూడటానికి సామాన్య ప్రేక్షకులు మొగ్గు చూపుతారు. సినిమా ఎంత బాగున్నా ఇంటిల్లిపాది చూడాలంటే… ఇంత పెద్ద మొత్తంలో ఎలా బేర్ చేయగలరో డిస్ట్రిబ్యూటర్లు ఆలోచించాలి.  ఇప్పటికైనా నిర్మాతలు, పంపిణీదారులు ఆలోచించి… బాహుబలి సినిమాని చూసే అవకాశం సామాన్య ప్రేక్షకులకు కల్పించాలి. అప్పుడే పైరసీని వారు ఎంకరేజ్ చేయరు. ఇక్కడ మరో మాట అనొచ్చు. కొద్దిరోజులు ఆగితే… అందరూ థియేటర్లలో చూడొచ్చు కదా అని. నిజమే.. కానీ మొదటి రోజు చూడాలనేది మానవుని సహజ నైజం.  పక్కోడు సినిమా చూస్తే… తాను మాత్రం ఎలా వుండగలడు. అలాంటి వారినీ దృష్టిలో వుంచుకున్నప్పడే అందరూ థియేటర్లకొచ్చి సినిమా చూస్తారు. లేకుంటే.. ఎంత భారీదనంతో కూడుకున్న సినిమా తీసినా… దాన్ని థియేటర్లో చూసేలా చేయగల బాధ్యత ఆ చిత్ర బృందానికి వుంటుంది.  ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎలాగూ టేబుల్ ప్రాఫిట్ తో నిర్మాతలు ఉన్నారేనే ప్రచారం వుంది. కనీసం వారైనా చొరవ తీసుకుని అందరికీ టిక్కట్లు అందుబాటులో వుండేలా చూడాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ఇప్పటికే మూడేళ్లు ప్రభాస్ ని తన అభిమానులకు దూరం చేశారు. దాన్ని దృష్టిలో వుంచుకునైనా… బ్లాక్ టిక్కట్ల దందాకు తెరదించాలి. అప్పడే ప్రభాస్ అభిమానులు ఊడా సంతోషిస్తారు. మౌత్ టాక్ తో సినిమాకి మరింత ప్రచారం తెచ్చిపెడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here