‘బాహుబలి’ బెనిఫిట్ షో 24 లక్షలు ఏపీకి డొనేషన్

43

x10-1436532608-sai-korrpati-679.jpg.pagespeed.ic.K7yKKTFTJlఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో వారాహి చలనచిత్రం భాగం కావాలనుకుని కృష్ణాజిల్లాలో ‘బాహుబలి’ బెనిఫిట్ షోను ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి అందజేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నిర్వహించిన ఈ బెనిఫిట్ షోస్ ద్వారా 24, 24, 9999 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి ఆంధ్రప్రదేశ్ నూతన నిర్మాణ రాజధానికి విరాళంగా అందజేయనున్నారు. ఎన్నో ఉత్తమ చిత్రమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సాయికొర్రపాటి సినిమా రంగంతో పాటు, సేవారంగంలోనూ ముందుంటున్నారు. గతంలో హుదూద్ బాధితులకు ఆర్ధిక సహాయంతో పాటు వంద టన్నుల బియ్యం కూడా అందించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుని సహృదయతను చాటుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here