'బాహుబలి' పోస్టర్‌కి గిన్నిస్ రికార్డు

40

61437577315_625x300తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘బాహుబలి-ద బిగినింగ్‌’ కేరళలో చిత్రం విడుదల హక్కులను గ్లోబల్ యునైటెడ్ మీడియా పొందింది. వారు చిత్ర ప్రమోషన్‌ వర్క్‌లో భాగంగా కొచ్చి‌లో బాహుబలి భారీ పోస్టర్‌ను రూపొందించారు. ఇప్పుడు ఈ భారీ పోస్టర్‌ గిన్నిస్ రికార్డుకెక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో గతంలో ఉన్న భారీ పోస్టర్ 5,087.25 చదరపు అడుగుల రికార్డును బాహుబలి పోస్టర్ బద్దలుకొట్టింది. తాజాగా రూపొందించిన బాహుబలి పోస్టర్ 51,968.32 చదరపు అడుగులుగా ఉంది. ఈ చిత్రం విడుదల అయిందంటే ఇటువంటివి మరిన్ని రికార్డులను పొందుతుందని చిత్ర యూనిట్ ఆత్మవిశ్వాసం వ్యక్తంచేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here