'బాహుబలి' కోసం ఎదురుచూస్తున్నా..వెంకటేష్‌

46

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయం తో తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’ సినిమా కోసం సగటు ప్రేక్షకుడిగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సినీ నటుడు వెంకటేష్‌ అన్నారు. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం ఈనెల 28న చెన్నైలో జరగనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమ వివరాలను తెలిపేందుకు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్‌ మాట్లాడుతూ.. ‘ఫిల్మ్‌ఫేర్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. ఇంతకుముందు ఐదు సార్లు పురస్కారాలు వచ్చాయి. ఈ అవార్డులు నా కెరీర్‌కు ప్రోత్సాహంగా ఉపయోగపడ్డాయి’ అని అన్నారు. తెలుగు చిత్రసీమలో సృజనాత్మక దర్శకులు ప్రేక్షకుల అభిరుచి తగినట్లుగా కొత్త కథలు తీసుకొస్తున్నారని అన్నారు. నాలుగు భాషల నుంచి మొత్తం 10 విభాగాల్లో నామినేషన్లు స్వీకరించగా తెలుగు పరిశ్రమ నుంచి దృశ్యం, కార్తికేయ, మనం, రేసుగుర్రం, రన్‌ రాజా రన్‌ చిత్రాలు ఉత్తమ చిత్రాల విభాగంలో పోటీ పడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here