బాబ్లీ కేసులో చంద్రబాబుకు అండగా నిలిచిన కాంగ్రెస్

127

బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మాబాద్ కోర్టు సీఎం చంద్రబాబుకు నోటీసులివ్వడాన్ని ఏపీ కాంగ్రెస్ తప్పుపట్టింది.బాబ్లీ ప్రాజెక్టుపై పోరాటం చేసిన చంద్రబాబుపై కేసులు, నోటీసులు ముమ్మాటికీ తప్పేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాపోరాటాలు చేస్తే కేసులు పెట్టడం సరికాదని, ఏపీలోనూ ఉద్యమాల్లో పాల్గొన్నవారిపై కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని జోస్యం చెప్పారు. మరోవైపు బాబ్లీ కేసులో ఐదేళ్ల క్రితం చార్జిషీట్ వేశామని, చార్జిషీట్‌ వేశాక అంశం కోర్టు పరిధిలో ఉంటుందని నాందేడ్‌ ఎస్పీ కతార్‌ తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేశారని, 16 మందిపై చార్జిషీట్‌ వేశామని చెప్పారు. 21న హాజరుపర్చాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించిందని, నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ కోర్టు విచక్షణాధికారానికి చెందినదని కతార్‌ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here