ప‌చ్చ‌ద‌నానికి నేను సైతం.. మెగాస్టార్

34
మెగాస్టార్ చిరంజీవి సైతం త‌న‌వంతు బాధ్య‌త‌గా `హ‌రిత‌హారం` ఛాలెంజ్‌ని స్వీక‌రించారు. అన్న‌య్య త‌న ఇంటి పెర‌ట్లో మొక్క‌లు నాటి హ‌రిత‌హారం ఉద్య‌మానికి నేను సైతం అంటూ బాస‌ట‌గా నిలిచారు. మెగాస్టార్ స్వ‌యంగా మొక్క‌ను  నాటి, దానికి నీళ్లు పోస్తున్న ఫోటోల్ని ప్ర‌స్తుతం మెగాభిమానులంతా షేర్ చేస్తూ ఎవ‌రికి వారు హ‌రిత‌హారం చేప‌ట్టాల‌ని ఉద్య‌మిస్తున్నారు. మంచి కోసం మేము సైతం అంటూ మెగాభిమానులు క‌దిలొస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాల‌న్న‌దే అన్న‌య్య చిరంజీవి ధ్యేయం. అందుకే ఆయ‌న అభిమానుల‌కు ఓ వీడియో సందేశం ఇచ్చారు. మా ఇంటి పెర‌ట్లో మూడు మొక్క‌లు నాటాను. ఇంత మంచి ప‌నికి స్ఫూర్తినిచ్చిన మిత్రులంద‌రికి ధ‌న్య‌వాదాలు అన్నారు. తాను ఈ మంచి ప‌ని చేయ‌డ‌మే గాక‌.. మరో ముగ్గురిని హ‌రిత‌హారం ఛాలెంజ్‌కి నామినేట్ చేశారు. బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మీడియా లెజెండ్ రామోజీరావు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌ను హ‌రిత‌హారానికి ఆహ్వానించారు. ఓవైపు సైరా షూటింగులో బిజీగా ఉండీ కొంత స‌మ‌యాన్ని అన్న‌య్య ఇలా హ‌రిత‌హారం కార్య‌క్ర‌మానికి కేటాయించ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here