ప్ర‌తి నెలా ఆహార‌బుట్ట‌..ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కొత్త ప‌థ‌కం!

88

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మరో సంక్షేమ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు.ఇప్ప‌టికే అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ ఆయ‌న‌, తాజాగా మ‌రో ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేశారు.గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చుతున్న టీడీపీ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌వేశ‌పెడుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో సంక్షేమ ప‌థ‌కాన్ని చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నివ‌శిస్తున్న ప్ర‌జ‌ల పౌష్టికాహార లోపాన్ని అధిగ‌మించేందుకు ప్ర‌తినెలా ఆహారబుట్ట ఉచితంగా గిరిజ‌న కుటుంబాల‌కు అంద‌జేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం భావించింది.ఈ ప‌థ‌కానికి చంద్ర‌న్న గిరి పోష‌ణ లేదా గిరి ఆహార‌భ‌ద్ర‌త అనే పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గురువారం ప్ర‌పంచ ఆదివాసీ దినోత్స‌వాన్ని ప‌ర‌స్క‌రించుకుని విశాఖ‌పట్నం జిల్లా పాడేరులో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. అలాగే దాదాపు 5 వేల గిరిజ‌న కుటుంబాల‌కు 13 వేల ఎక‌రాల భూమిని చంద్ర‌బాబు పంపిణీ చేయ‌నున్నారు.ఇక ట్రైకార్ ద్వారా 60 మంది ల‌బ్ధిదారుల‌కు ఇన్నోవా,బొలేరో వాహ‌నాల‌ను చంద్ర‌బాబు అందించ‌నున్నారు. ప్ర‌పంచ ఆదివాసీ దినోత్స‌వం సంద‌ర్బంగా గురువారం పాడేరులో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే స‌భ‌లో చంద్ర‌బాబు పాల్గొనన్నారు. ఈ సంద‌ర్భంగా గిరిజ‌నుల‌కు చంద్ర‌బాబు వ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని 66 వేల మంది గిరిజ‌నుల‌కు కొత్తగా పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. అలాగే పాడిప‌రిశ్ర‌మ ద్వారా 12 వేల గిరిజ‌న కుటుంబాల‌కు ల‌బ్ది చేకూర్చేలా ప‌లు సంస్థ‌ల‌తో చంద్ర‌బాబు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here