ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘హైపర్‌’ స్పెషల్‌ షోలు

IMG-20161003-WA0016ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’. ఈ చిత్రం మంచి ఎంటర్‌టైనర్‌గానే కాకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ప్రజలకు సేవలందించే ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని చాటి చెప్పే విధంగా రూపొందించారు. ఈ చిత్రం ద్వారా అందించిన మెసేజ్‌ ప్రతి ఒక్కరికీ చేరుతోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పాత్రలో సత్యరాజ్‌ పెర్‌ఫార్మెన్స్‌కి, ఈ చిత్రం కోసం అబ్బూరి రవి రాసిన డైలాగ్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.
ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా అన్ని ఏరియాల్లో సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకొని విజయపథంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్‌ షోలు ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో సత్యరాజ్‌ చేసిన క్యారెక్టర్‌ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రిలేట్‌ అవుతుందని, తప్పకుండా వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నారు.
రామ్‌ ఎనర్జిటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌, నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగిగా సత్యరాజ్‌ ప్రదర్శించిన నటన, అబ్బూరి రవి రాసిన మాటలు, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ డైరెక్షన్‌, జిబ్రాన్‌ చేసిన పాటలు, మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, 14 రీల్స్‌ నిర్మాణం ‘హైపర్‌’ చిత్రాన్ని పెద్ద హిట్‌ చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *