ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్కు

ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్కు కర్నూలులో నెలకొల్పామని, రైతులపై భారం పడకుండా ఎనర్జీ పంప్‌‌సెట్స్, సోలార్ పంప్‌సెట్స్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

జన్మభూమి-మాఊరు 5వరోజు నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. నరేగా పథకం ఎన్నో ఏళ్లుగా ఉన్నా సక్రమంగా వినియోగించుకోలేకపోయారని, కానీ… ఆ పథకంతో 22శాఖల్లో అద్భుత ఫలితాలు సాధించామని, ప్రతి గ్రామంలో ఆస్తులు సృష్టించామని సీఎం అన్నారు.

అమరావతితో రాయలసీమ జిల్లాలకు రోడ్ కనెక్టివిటీ పెంచుతున్నామని, సమర్ధంగా పనిచేస్తే ఏదీ అసాధ్యం ఉండదని, ప్రతిదీ సాధ్యమేనని, సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారమే ప్రజా సంతృప్తికి కొలమానమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *