ప్రత్యేక హోదా వచ్చేవరకూ పోరు ఆగదు

48

Jagan-Mohan-Reddy“ప్రత్యేక హోదా” కోసం గుంటూరులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహారదీక్షకు చేస్తున్నారు. అంతకుముందు ఆయన దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్ర కేబినెట్‌లోని తన మంత్రులను ఉపసంహరించుకుంటానని చంద్రబాబు అల్టిమేటమ్ ఇచ్చి ఒత్తిడి తీసుకొస్తే, కేంద్రం కచ్చితంగా దిగివచ్చి హోదా ఇస్తుందని చెప్పారు.  అలా చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని,అలా అల్టిమేటం ఇచ్చిన 24 గంటలలోపు జైలుకు వెళతానేమోనని ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో మనం పోరాటం ఆపకూడదని, చంద్రబాబు మనసు మార్చుకుని కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెచ్చేవరకూ పోరు కొనసాగుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో అపారమైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here