ప్రత్యేక హోదాపై రాజ్యసభలో గందరగోళం

208
New Delhi: Opposition members protest in the Rajya Sabha in New Delhi on Tuesday. PTI Photo / TV GRAB (PTI12_22_2015_000269A)

ఏపీకు ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో గందరగోళం కొనసాగింది. బిల్లుపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు తాము మద్దతు తెలుపుతున్నట్లు తెదేపా సభ్యుడు సీఎం రమేష్‌ ప్రకటించారు. దీనిపై డిప్యూటీ ఛైర్మన్‌ స్పందిస్తూ… నిబంధనల ప్రకారం ప్రైవేటు బిల్లుపై ఈ రోజు చర్చ చేపట్టడం కుదరదన్నారు. ఆగస్టు 5న బిల్లు చర్చకు వస్తుందని పేర్కొన్నారు. అయితే దీనిపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్‌ సభ్యులు గట్టి పట్టుపట్టారు. గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here