ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలి-నన్నపనేని

33

వేగవంతమైన సమాజంలో అందరూ తమతమ జీవితాలలో సేవాభావం కూడా ఒక భాగమని గుర్తించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఇండియన్ ఐకాన్స్ జాతీయ ప్రదానోత్సవ పురస్కార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు.వివిధ రంగాలలో నిష్ణాతులైన పలువురు ప్రముఖులకు నిర్వాహకులు పురస్కారాలు అందజేయడం ద్వారా మరికొందరు స్ఫూర్తి పొందుతారని ఆమె పేర్కొన్నారు.

ప్రధానంగా నేడు సమాజంలో అందరూ తమతమ జీవన ప్రమాణాల పెంపుకోసం చేస్తున్న పోరాటం తో పాటు సమాజంలో ఎంతోమంది మనకన్నా దిగువన ఉన్న విషయం గుర్తించి వారికి చేతనైన చేయాలని ఉద్భోదించారు.మహిళలకు జరుగుతున్న కొన్నిరకాల అన్యాయాలను సమాజంలో అందరూ ప్రశ్నించాలని పేర్కొన్నారు.తెలుగు దేశం పార్టీ నాయకులు, జిల్లాగ్రంధాలయ చైర్మన్ బండారు హనుమంతరావు మాట్లాడుతూ నిర్వాహకులను, పురస్కార గ్రహీతలను అభినందించారు.విద్య, సామాజిక సేవ, పర్యావరణం, ఆధ్యాత్మికం, మైనార్టీ విభాగం, బలహీన వర్గాల సంక్షేమం తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన డాక్టర్ వి. రాజేంద్రప్రసాద్, గొట్టుముక్కల సుజాత, పోతురాజు వెంకట నరసింహ కుమార్, నల్లమోతు వేణుగోపాలరావు, మానికి రెడ్డి సత్యనారాయణ, బి. రాజేశ్వరరావు, పెద్దింటి శేష ప్రసాద్, షేక్ షకీనా, సి. రవీందర్ యాదవ్, వేమవరపు వరలక్ష్మి తదితరులకు పురస్కారాలు ప్రదానం చేశారు.దారా కరుణశ్రీ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని మేదర సురేష్ కుమార్ నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here