ప్యాకేజీ ప్రకటించిన రోజు జగన్ ఏం చేశాడో తెలిస్తే షాకే!

96

మునుపటికి ‘రోమ్ నగరం తగలబడి పోతుంటే… పిడేల్ వాయించాడట ఓ ప్రబుద్ధుడు’. అచ్చం అలాంటోడే ఇప్పుడు మనకూ ప్రతిపక్షనేత హోదాలో దొరికాడు. యావత్ ఏపీ ప్రజలు ఎంతో ఆత్రుతగా కళ్లలో ఒత్తులు వేసుకుని… కేంద్రం ఏం ప్రకటిస్తుందా అని అర్ధరాత్రి దాకా ఎదురు చస్తుంటే… మన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలిస్తే… ఆ ప్రబుధ్దుడికి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి గుణపాఠం చెప్పాలో ఏపీ ప్రజలే నిర్ణయిస్తారు. ఐదుకొట్ల మంది ఆంధ్రల భవిష్యత్తు ముడిపడిన ఓ ప్రధానమైన అంశం గురించి ప్రజలంతా వేచి చూస్తుంటే… ఈనగారు మాత్రం పదింటికే మంచం ఎక్కేశాడంట. అది ఎవరో చెప్పింది కాదు. ఆయనగారే నిస్సిగ్గుగా మీడియా ముందు సెలవిచ్చారు.

ఎక్కడైనా అధికార పక్షం తప్పులు చేస్తుంటే నిలదీయాల్సిన వ్యక్తి.. కనీసం కన్సర్న్ లేకుండా ఇలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిన దురదృష్టం తప్ప మరొకటి కాదు. కేంద్రం హోదా కాదు.. ప్యాకేజీ ఇవ్వడానికి వారం రోజుల నుంచి కసరత్తు చేస్తున్నట్టు లీకేజీలు వస్తూనే వున్నాయి. కానీ… ఒక్కరోజు ‘మాకు ప్యాకే వద్దు… ప్రత్యేక హోదానే కావాలి’ అని ఒక్క రోజంటే… ఒక్కరోజు మీడియా సమావేశం పెట్టి గొంతు చించుకున్న పాపాన పోలేదు. పోనీ.. వెంకయ్య అండ్ బ్యాచ్ అర్ధరాత్రి ప్యాకేజ్ ప్రకటించాకైనా వెంటనే మీడియా ముందుకొచ్చి మాట్లాడాడా అంటే అది లేదు. పైగా నిర్లజ్జగా.. ఏమాత్రం సిగ్గులేకుండా ‘నేను సాధారణంగా 9.30కే పడుకుంటా. కానీ ఆ రోజు 10 గంటల వరకు మేల్కొని.. ఆ తరువాత నిద్రపోయా’ అంటూ.. తనకు స్పెషల్ స్టేటస్ పై ఏమాత్రం ఇంట్రెస్ట్ వుందో చెబుతున్నాడు.

గౌరవ ప్రతిపక్షనేత అంటే… అర్ధ రాత్రి.. అపరాత్రి అనుకోకుండా… రాష్ట్రానికి ఏ సమయంలోనైనా అన్యాయం జరిగితే తక్షణం స్పందించాలి. అటుపక్క దాదాపు 70 ఏళ్లు వయసులో వున్న ముఖ్యమంత్రే… అర్ధరాత్రి వరకు మేల్కొని బి.జె.పి.పెద్దల ప్రెస్ మీట్ ను విని… ఆ తరువాత తన అభిప్రాయం వెలిబుచ్చాడు. మరి వారికి వున్నత ఓర్పు… సహనం.. మన ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డికి లేకపోవడం ఏపీ ప్రజల దురదృష్టం. అరుణ్ జట్లీ ప్రకటించేది సోకాల్డ్ ప్యాకేజ్ అని తెలిసి కూడా… దానిమీద వెంటనే స్పందించలేదంటే.. జగన్ ఇక.. ఏపీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడతాడో ప్రజలే తేల్చుకోవాలి.

రాజకీయనాయకుడి లక్షణం ఇది కాదు. ప్రజలను.. రాష్ట్రాన్ని 24×7 కనిపెట్టుకుని వుండాలి. అప్పుడే అలాంటి నాయకుల వల్ల ప్రజలకు కొంతైనా ఉపయోగం వుంటుంది కానీ… ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న సమయంలో కూడా నేను పది గంటలకే కుంభకర్ణుడిలా నిద్రపోతా.. ఆ తరువాత గావు కేకలు పెడతా అంటే… ప్రజలు హర్షించరు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here