పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో ‘మాయామాల్‌’

203

`హోరా హోరీ` ఫేమ్ దిలీప్ హీరోగా గ్రీష్మ ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వైష్ణ‌వి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం `మాయా మాల్‌`. ఇషా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సోనియా, దీక్షాపంత్‌, పృథ్వీ, నాగినీడు త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగణంగా న‌టించారు. గోవింద్ లాలం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని యార్ల‌గ‌డ్డ జీవ‌న్‌కుమార్‌, కె.వి.హ‌రికృష్ణ‌, చందు ముప్పాళ్ల‌, న‌ల్లం శ్రీనివాస్‌లు నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా…చిత్ర నిర్మాత‌లు యార్ల‌గ‌డ్డ జీవ‌న్‌కుమార్‌, కె.వి.హ‌రికృష్ణ‌, చందు ముప్పాళ్ల‌, న‌ల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ “ల‌వ్ అండ్ హ‌ర్ర‌ర్ కామెడి నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఇంతకు ముందు గీతాఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ లో వర్క్ చేసిన ద‌ర్శ‌కుడు గోవింద్ లాలం కొత్త కథనంతో చక్కగా తెరకెక్కించారు. దిలీప్, ఇషా జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో ఇంకా నాగినీడు, పృథ్వీ, ష‌క‌ల‌క శంక‌ర్‌, శ్ర‌వ‌ణ్‌, కాశీవిశ్వ‌నాథ్‌, తాగుబోతు ర‌మేష్‌, క‌ల్కి వంటి భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. ముఖ్యంగా పృథ్వీ, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేష్‌ల కామెడి చాలా హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే యాబై చిత్రాల‌కు పైగా సంగీతం అందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్‌గారు ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్ర‌ఫీ అందింస్తుండ‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. మంచి టీంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
దిలీప్‌, ఇషా, సోనియా, దీక్షాపంత్‌, నాగినీడు, పృథ్వి, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేష్‌, కాశీవిశ్వ‌నాథ్, శ్ర‌వ‌ణ్‌, క‌ల్కి త‌దితరులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్ర‌ఫీః దాశ‌ర‌ధి శివేంద్ర‌, ఎడింటింగ్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః ర‌మ‌ణ వంక‌, యాక్ష‌న్ః విజ‌య్‌, నిర్మాత‌లుః యార్ల‌గ‌డ్డ జీవ‌న్‌కుమార్‌, కె.వి.హ‌రికృష్ణ‌, చందు ముప్పాళ్ల‌, న‌ల్లం శ్రీనివాస్‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: గోవింద్ లాలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here