పోలీసు బాసుల బదిలీపై హైకోర్టులో సర్కార్ పిటీషన్

103

రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వారి బదిలీని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై బుధవారం మధ్యాహ్నం కోర్టు విచారణ జరపనుంది.
ఏపీ నిఘా విభాగాధిపతి సహా ఇద్దరు ఎస్పీలను ఎన్నికల సంఘం మంగళవారం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారిని పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ వైకాపా ఫిర్యాదుపై ఈ చర్యలు చేపట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారులను బదిలీ చేయడం అభ్యంతరకరమని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై మధ్యాహ్నం విచారణ జరగనుంది. పిటిషన్‌పై వాదనలు వినిపించాల్సిందిగా ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here