పోలీసుల నిఘాలో దేవరగట్టు

214

దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 8 (మంగళవారం) వ తేదిన కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టిందని బన్ని ఉత్సవానికి 1000 మంది కి పైగా పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇందులో 7 మంది డిఎస్పీలు, 30 మంది సిఐలు, 65 మంది ఎస్సైలు, 223 మంది ఎఎస్సైలు మరియు హెడ్ కానిస్టేబుళ్ళు, 388 మంది కానిస్టేబుళ్ళు, 30 మంది మహిళా పోలీసులు, 50 స్పెషల్ పార్టీ బృందాలు, 3 పట్లూన్ల ఎఆర్ బలగాలు, 300 మంది హోంగార్డులు బన్ని ఉత్సవం బందోబస్తు విధులలో ఉంటారని తెలిపారు.
బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహాకరించాలన్నారు. బన్ని ఉత్సవంలో కర్రలు తగిలి గాయపడితే జరగబోయే దుష్పరిమాణాలపై దేవరగట్టు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు, లఘు చిత్రాలు, పోస్టర్లు, జనచైతన్య నాటికల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ప్రాణనష్టం, తీవ్రగాయలు కలగకుండా దేవరగట్టు సంప్రదాయాన్ని చాటిచెప్పాలన్నారు.
గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు చర్యలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. బన్ని ఉత్సవంలో ఎవరైన అల్లర్లు, గొడవలు సృష్టిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే అక్కడి ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. మద్యం సేవించి రింగులు గల కర్రలతో ఉత్సవంలో పాల్గొనడం వల్ల తలలకు గాయాలు, కాళ్ళు, చేతులు విరిగే ప్రమాదాలను ప్రతి ఏడాది చూస్తున్నామన్నారు. ఏదైనా జరగరానిది జరిగితే వారిపై ఆధారపడిన కుటుంబాలు, పిల్లలు ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు.
దేవరగట్టు చేరుకునే పరిసర గ్రామాల్లోనూ, ప్రధాన రహాదారుల్లోనే కాక చిన్న చిన్న దారుల్లోనూ బందోబస్తు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
భద్రతా చర్యల్లో భాగంగా నాటు సారా, మద్యం నియంత్రణకు ఎక్సైజ్, పోలీసుశాఖ సమన్వయంతో దాడులు చేస్తున్నామన్నారు. ఏవరైనా అక్రమంగా మద్యం అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసిందన్నారు.
• సింహాసనం కట్ట నుండి మల్లేశ్వరస్వామి గుడి వరకు సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
• మఫ్టీ పోలీసు బృందాలతో అసాంఘిక శక్తులపై గట్టి నిఘా ఉంచామన్నారు.
• ఉత్సవం తిలకించే ప్రజలపై నిప్పులు విసురుట, చీకటిలో అల్లర్లకు పాల్పడే వారిని డ్రోన్ కెమెరాతో ఫోటోలు, విడియోల ద్వారా చీత్రీకరించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
• మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలు బన్ని ఉత్సవానికి దూరంగా ఉండాలన్నారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు.
• వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కన్నడ, తెలుగు భాషలలో కూడా అనౌన్స్ చేసే వారిని ఏర్పాటు చేశామన్నారు.
• కర్రల సమరాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలన్నారు.
బన్ని ఉత్సవంలో ఫైర్ సిబ్బంది, వైద్యసిబ్బంది, అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బన్ని ఉత్సవంలో ఎలాంటి గాయాలు కాకుండా పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. భక్తుల్లో మార్పు రావాలని, ఈ కర్రల సమరానికి స్వస్తి పలకాలని దేవరగట్టు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈసంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here