పోలీసులు అదుపులో ‘బ్రహ్మోత్సవం’ కెమెరామెన్ల

87

brahmotsavam-Movie-Stillsమహేశ్‌బాబు హీరోగా  నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’.ఇదిలా ఉంటే.. తిరుమల వెంకటేశ్వరుడి రథసేవల దృశ్యాలను ఈ సినిమాలో కలిపాలనుకున్నారట చిత్ర బృందం. అందులో భాగంగానే తిరుమలలో రథసప్తమి వేడుకలను వీడియో తీస్తున్న ఈ చిత్ర కెమెరామెన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో సినిమాల చిత్రీకరణ నిషిద్ధం. కాగా ఎలాంటి అనుమతి లేకుండానే ఈ చర్యకు పాల్పడినందుకుగాను ముగ్గురు కెమెరామెన్లను టీటీడి విజిలెన్స్ వారి సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా కోసమే తాము స్వామి వారి సేవలను చిత్రీకరించినట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here