పోలీసులపై దాడి బాధాకరం…క్వారీల్లో తనిఖీలు:డీజీపీ

34

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్‌పీ ఠాగూర్‌ ఆదివారం రాయలసీమ జిల్లాల ఎస్పీలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా రాపూరు స్టేషన్‌ ఘటనపై స్పందించారు. పోలీసులపై జనాలు దాడి చేయటం బాధాకరమన్నారు. రాపూరు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని డీజీపీ ఠాగూర్‌ సూచించారు. కర్నూలు క్వారీ పేలుడు, రాయల సీమలో ఫ్యాక్షన్‌ నివారణ,ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదిదర అంశాలపై పోలీసు అధికారులతో చర్చించినట్లు డీజీపీ ఆర్‌పీ ఠాగూర్‌ వెల్లడించారు. కర్నూలు క్వారీ ఘటన నేపథ్యంలో నాలుగు జిల్లాల పరిధిలో మైనింగ్‌ క్వారీలపై తనిఖీలు చేపడతామని డిజిపి చెప్పారు. రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌, ఫైర్‌ శాఖ సహాయంతో ఈ తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రమ లైసెన్స్‌ కలిగి ఉన్నట్లయితే క్వారీలను మూసివేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here