పోలవరానికి ఇప్పటివరకు 13,430 కోట్లు ఖర్చు చేశాం – మంత్రి దేవినేని

26

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పోలవరం వర్చువల్ పరిశీలన ప్రాజెక్టులపై రివ్యూ సమావేశంలో పాల్గొన్న మంత్రి అనంతరం అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు పోలవరం పనులు 53.5 శాతం పూర్తయ్యాయని డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పనులు జూన్ 11కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని మంత్రి దేవినేని ఉమా అన్నారు

విభజన తర్వాత పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 8,294 కోట్లు ఖర్చు చేయగా కేంద్రం నుండి 5,135 కోట్లు మాత్రమే వచ్చాయని ఇంకా 2,952 కోట్లు రావాల్సివుందన్నారు వచ్చే సోమవారం సిఎం పొలవరాన్ని సందర్శిస్తారని మంత్రి ఉమా తెలిపారు

మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ లతో పాదయాత్ర విలువ పోగొట్టిన జగన్ అమిత్ షా కు టీడీపీ శ్రేణులు నిరసన తెలిపితే జగన్ కు ఎందుకు బాధ కలుగుతోందో చెప్పాలన్నారు

రాబోవు ఎన్నికల్లోకూడా గెలిచే పరిస్థితులు కనపడకపోవడంతో నిరాశా నిస్పృహలతో ఉన్న జగన్ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడని పులివెందుల నుండి కూడా రైతులు వచ్చి పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను చూసి ఆనందం వ్యక్తం చేస్తుంటే జగన్ మాత్రం కళ్ళున్న గుడ్డివాడిలా ఆరోపణలు చేస్తున్నాడన్నారు.

జిల్లాలలో నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్ డ్యాముల నిర్మాణం వంటి వాటి వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2.3 మీటర్ల భూగర్భజలాలు పెరిగాయని మంత్రి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here