పోలవరం పరిశీలనకు గడ్కరీ, చంద్రబాబు

44

పోలవరం ప్రాజెక్ట్ పనులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.మంత్రి మాట్లాడుతూ సవరించిన పోలవరం అంచనాలను కేంద్రానికి పంపామన్నారు.రూ.57 వేల కోట్లతో అంచనాలు సవరించినట్లు వెల్లడించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం అంచనాలు పెరిగాయన్నారు.అంచనాలు 3 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెరిగినట్లు స్పష్టం చేశారు. తక్షణమే 10 వేల కోట్లను విడుదల చేయాలని గడ్కరీని కోరుతామన్నారు. పూర్తయిన పనుల్లో కేంద్రం నుంచి రూ.2300 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. పోలవరం అథారిటీకి బిల్లులు సమర్పించామన్నారు. డయా ఫ్రం వాల్ పూర్తి చేశామని, గోదావరి వరదతో పనులు ఆగలేదని మంత్రి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here