పేదల ఆరోగ్యం పై జగన్ ద్రుష్టి; మంత్రి సురేష్

46

స్వతహాగా వైద్యుడైన దివంగత నేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తే నాన్న బాటలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా పేదల ఆరోగ్యం పై ద్రుష్టి సారించారని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. నాన్న తరహాలోనే ఇప్పుడు జగనన్న కూడా వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టి రాష్ట్రం లో ద్రుష్టి లోపం లేకుండా చూడాలనే లక్ష్యం తో పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. యర్రగొండపాలెం లో ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించిన అయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రం లో 70 లక్షల మంది విద్యార్థులకు మొదటి విడతలో స్క్రీనింగ్ టెస్ట్ చేయటం జరుగుతుందని అన్నారు. మొత్తం 7 రకాల కంటి అద్దాల ఫ్రేమ్ లు ఇవ్వటం జరుగుతుందని విద్యార్థులు కోరిన రంగులో వారికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. జగనన్న కు ప్రీతి పాత్రమైన శాఖల్లో మొదటిది విద్యాశాఖ అని అయన అన్నారు. అందుకే విద్యాశాఖ కు పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రం లో పేదరికం తో విద్యకు ఆటంకం ఏర్పడకూడదని ఆ లక్ష్యం తో జగనన్న అమ్మవడి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి ఖాతా లో 15 వేలు జమచేసె ఈ కార్యక్రమం జనవరి 26 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. కార్యక్రమం లో విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. వారిని మంత్రి అభినందించారు. అనంతరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే కిట్లను పంపిణీ చేసారు. వైద్యపరీక్షల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ షన్మోహాన్, నియోజకవర్గం ప్రత్యేకాధికారి పి. ఓ వెంకటేశ్వరరావు, వైద్యశాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here