పుట్టినరోజు వేడుకలకు సీఎం చంద్రబాబు దూరం..!

59

ఈనెల 20వతేదీన ముఖ్యమంత్రి చంద్ర్రబాబు నాయుడు ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో దీక్ష నిర్వహించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ దీక్ష జరగనుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేయనున్నారు. అదే రోజు చంద్రబాబునాయుడు పుట్టినరోజు కావడంతో వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించారు.ఆ రోజంతా నిరాహారదీక్ష చేయాలని, ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు 12గంటలపాటు ధర్మపోరాట దీక్ష నిర్వహించాలని సంకల్పించారు.ఇక 30వతేదీన తిరుపతిలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here