పార్లమెంట్ ఆవరణలో 5వ రోజు టీడీపీ ఎంపీల నిరసన

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ ఆవరణలో తెదేపా ఎంపీల నిరసన కొనసాగుతోంది. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ఈ ఉదయం నిరసన చేపట్టారు. వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఏపీకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విభజన హామీలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

వినూత్న వేషధారణలో..

ఈ నిరసన కార్యక్రమంలో వినూత్న వేషధారణలో ఎంపీ శివప్రసాద్‌ పాల్గొన్నారు. వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ తనను ఆవహించారని ఆయన చెప్పారు. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో మోదీ హామీలు ఇచ్చి మరిచిపోయారని.. ఇందుకు పార్లమెంట్‌ సాక్షిగా హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం లెక్కచేయడం లేదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఎలాంటి గతిపట్టిందో.. భాజపాకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *