పార్లమెంటు సమావేశాల తర్వాత హోదాపై నిర్ణయం

57

chandrababunaidu-k9SC--621x414@LiveMintప్రత్యేక హోదాపై పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మోడీతో ఆయన భేటీ అయిన తర్వాత మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ప్రత్యేక హోదా సెంటిమెంటు ఎపిలో బలంగా ఉందని, సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరానని ఆయన తెలిపారు.ప్రత్యేక హోదాపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే రెండు పార్టీలకు నష్టం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.మోడీ ప్రత్యేక హోదా పై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని టిడిపి ఎమ్.పిలు అన్నారు. కృష్ణ పుష్కరాలకు రావాలని ప్రధానికి చంద్రబాబు ఆహ్వానపత్రం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here