పాపికొండలకు వెళుతున్న టూరిస్ట్ బోట్ లో అగ్నిప్రమాదం!

64

80 మంది టూరిస్టులతో ఉన్న బోటు షార్ట్ సర్క్యూట్ తో మంటలు యాత్రికుల్లో భయాందోళన గోదావరి నది అందాలను, కిన్నరెసాని హొయలను తిలకించాలని బయలుదేరిన టూరిస్ట్ బోట్ ఒకటి కొద్దిసేపటి క్రితం అగ్నిప్రమాదానికి గురైంది.దాదాపు 80 మంది యాత్రికులతో బయలుదేరిన బోటు దేవీపట్నం మండలం వీరవరపులంక దగ్గర ప్రమాదానికి గురైంది.బోటులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్టు ప్రాధమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.ఈ ఘటనతో యాత్రికులు తీవ్ర భయాందోళనలకు గురై, తమ సెల్ ఫోన్ల నుంచి దగ్గర్లో ఉన్న పరిచయస్తులకు, పోలీసులకు ఫోన్లు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు, వెంటనే బోటు వద్దకు సహాయపు బోట్లను, గజ ఈతగాళ్లను పంపించారు.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here