పవన్ కల్యాణ్‌పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

29

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయాల్లో నెగ్గాలంటే రెండు పడవల మీద కాలుపెట్టారాదన్నారు.సినిమావాళ్ళు రాజకీయాల్లో నెగ్గరని, అది ఒక్క ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిందన్నారు.నందమూరి తారక రామారావు తొమ్మిది నెలల పాటు ప్రజల్లోనే జీవించడం వలన రాష్ట్ర ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని ముద్రగడ పేర్కొన్నారు.ఎన్టీఆర్ మాదిరి నెగ్గాలంటే పవన్ ప్రజల్లో తిరిగి విశ్వాసం కలిగించాలని ముద్రగడ సూచించారు.పవన్ ఓ మహా వృక్షము నీడలో ఉన్నారని, ఆయన బీజేపీని వదిలి బయటకు వస్తే గాని ఎదగలేరని అన్నారు.తాను ఏపార్టీలో గాని, ఎవరికి గాని మద్దతు ఇవ్వనని ముద్రగడ స్పష్టం చేశారు.తనకు ఐదు కోట్ల మంది ప్రజల కంటే తన జాతి ముఖ్యమని, అందుచేత తన జాతి కోసం ఎంతకైనా తెగిస్తానని ఆయన అన్నారు.తమ జాతికి ఎవరైతే న్యాయం చేస్తారో వారికి మాత్రమే తమ జాతి మద్దతు ఉంటుందని ముద్రగడ స్పష్టం చేశారు. వాగ్దానాలు చేసి విస్మరించిన చంద్రబాబు లాంటి నాయకులకు తమ జాతి తగిన సమయంలో బుద్ధి చెబుతుంద్నారు. చంద్రబాబు ప్రభుత్వం తనను ఘోరంగా అవమానించినా తమ జాతి కోసం మౌనంగా భరించానన్నారు. కాపు జాతి ప్రయోజనాలు కాపాడటానికి మరో పోరాటం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నానని, అందుకు తగిన కమిటీ కార్యాచరణ అంతర్గతంగా సిద్ధం చేస్తున్నట్లు ముద్రగడ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here