పవన్ ఒక్కడే.. ప్రకటనలను నమ్మొద్దు !

33

జనసేన పార్టీ పేరిట కొంత వ్యక్తులు చేస్తున్న ప్రకటనలను నమ్మొద్దంటూ ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లెటర్ హెడ్ తో ఒక ప్రకటన వచ్చింది . ‘జనసేన’ సంస్థాగత నిర్మాణం పూర్తిగా రూపుదిద్దుకోనందున జిల్లాల్లో, ఇతర ప్రాంతాల్లో ఇంకా పార్టీ అధికార ప్రతినిధులుగా ఎవరినీ నియమించలేదని ఈ ప్రకటనలో చెప్పారు. అయితే, జనసేన పార్టీ ప్రతినిధులమంటూ మీడియాలో పలు ప్రకటనలు వస్తున్నాయని, ఆ ప్రకటనలకు, తమకు ఎటువంటి సంబంధం లేదని, అవి తమ పార్టీ అభిప్రాయాలు కావని ఈ ప్రకటనలో వివరించారు. ఒకవేళ ఏదైనా విషయమై తాము ప్రకటన చేయదలచుకుంటే, పార్టీ లెటర్ హెడ్ పై అధికార ముద్రతో ఆ విషయాన్ని తెలియజేస్తామన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ తిరుపతి సభ అనంతరం కొంది జనసేన కార్యకర్తలం అంటూ కొంతమంది మీడియాలో లైవ్ చాట్ లో పాల్గొని అభిప్రాయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వారి అభిప్రాయాలు వ్యక్తిగతమని, వాటితో పార్టీకి సంబధం లేదని ఈ ప్రకటన ద్వారా తెలియజెప్పారు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here