పవన్ ఏమన్నాడంటే…?

27

పవన్ కళ్యాణ్…మళ్లీ ప్రజల ముందుకొచ్చార. చాలా కాలం తరువాత బహిరంగ సభలో మాట్లాడారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావం..రాజకీయాల్లో ఎంట్రీ..తదితర వాటిపై ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా..కేంద్రం ఇచ్చిన హామీలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే…

ఆచితూచి మాట్లాడుతా..
”నోటి నుండి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేం. ఏం మాట మాట్లాడినా ఆచి తూచి మాట్లాడుతా..దేశ సంపద యువత. జనసేన పార్టీ పెట్టి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు కావస్తోంది. రాజకీయాలు, పదవులపై వ్యామోహం లేదు. అభిమానుల ప్రేమ కావాలి. కోట్లు సంపాదిస్తాను..కోట్ల ట్యాక్స్ కడుతాను…సుఖంగా ఇంట్లో కూర్చొవచ్చు..మరి రాజకీయాలు ఎందుకు ? సమాజం..దేశం మీద బాధ..వ్యామోహం ఉంది. వర్తమాన రాజకీయాలు..రాజకీయ నాయకులు..యువతకు మేలు చేయకపోతే తనకు బాధ కలుగుతుంది. సినిమాలో చాలా చెబుతాం. రెండు గంటల్లో..అద్బుతాలు చెప్పవచ్చు..ఆస్తులు దానం..రౌడీలు..విలన్లు కొట్టవచ్చు. హీరోయిన్లతో పాటలు పాడవచ్చు..కానీ నిజ జీవితంలో అసలైన సమస్యలకు రాందేవ్ బాబా ద్వారా నూడ్స్ ల ద్వారా పరిష్కారం దొరకవు.

మూడు విషయాలు మాట్లాడుతా..
మూడు విషయాలు మాట్లాడటానికి వచ్చాను. పార్టీ ఆవిర్భావం..రాజకీయాలు ఏమి ఎదుర్కొన్నాను..టిడిపి ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది ? తన అభిప్రాయం…రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి కేంద్ర ప్రభుత్వం మీద తన అభిప్రాయాన్ని వెల్లడిస్తా. తిరుపతిలోనే ఎందుకు మాట్లాడాలి.. గతంలో ఇక్కడి నుండే మాట్లాడడం జరిగింది. అందుకే ఇక్కడి నుండే మాట్లాడడానికి నిర్ణయించినా. మోడీ భజన చేయలేదు…మోడీ భజన చేయడానికి పెట్టారని కొందరు..టిటిడి తొత్తులాగా ఉన్నారని..గబ్బర్ సింగ్ కాదు..రబ్బర్ సింగ్ అని అన్నారు. మాటలు పడకుండా ఉంటామా..? తన జీవితం రాష్ట్రం..దేశం కోసం అంకితం చేస్తా…మోడీకి భజన చేయను. కొన్ని మాటలు సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. వామపక్షాలు..వారు చేసే పోరాటం అంటే గౌరవం. చేగువేరా అంటే ఇష్టం.

సినిమా వినోదంగానే చూడాలి..
సినిమా అనేది వినోదంగా చూడాలని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీరియస్ గా తీసుకోవాల్సినవసరం లేదని అభిమానులకు పిలుపునిచ్చారు. నిజ జీవితంలో ఉండే సమస్యలను తాను సీరియస్ గా తీసుకుంటానని తెలిపారు. ఇటీవలే అభిమాని వినోద్ హత్యకు గురికావడం తనను కలిచివేసింది. టిడిపి, బిజెపికి సహాయం చేశాను. దీనివల్ల అధికారంలోకి ఎవరూ వచ్చారో ఆలోచించడం లేదు. రిస్క్ లు ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రభుత్వ పనితీరులో కొన్ని తప్పులుంటాయి. కొన్నిసార్లు ఎత్తి చూపాను. రైతుల భూములను తీసుకోవాలని అనగానే.. పవన్ కళ్యాణ్ చుట్టూ కులం ఉంది అన్నారు. కులం..మతం..ప్రాంతం అంటకడుతారా ? సంపాదీకయం రాసిన సంపాదకులతో మాట్లాడా. సహృదయంతో రిపీట్ చేయలేదు.

బీజేపీలోకి రావాలన్నారు…
జాతీయ పార్టీలకు భవిష్యత్ ఉంది…ప్రాంతీయ పార్టీలకు ఛాన్స్ లేదు..బీజేపీకి రావాలని అన్నారు. తన పార్టీ జాతీయ శ్రేయస్సు కోరే పార్టీ. పార్టీ సిద్ధాంతాలంటే గౌరవం.. ఉంది. ప్రత్యేక హోదా…విషయంలో మాట్లాడుతా. సీమాంధ్రులంటే చులకన..పౌరుషం లేని వారా ? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆడుకొంటోంది ? సీమాంధ్రులకు దేశంపై ప్రేమ ఉంది. ఇచ్చిన మాట వెనక్కి తిప్పితే సీమాంధ్రుల పోరాటం..పౌరుషం చూస్తారు’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here