పవన్‌ ఏ సమస్యను తీసుకొచ్చినా పరిష్కరించేందుకు సిద్ధం!

ప్రభుత్వం దృష్టికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఏ సమస్యను తీసుకొచ్చినా పరిష్కరించేందుకు సిద్ధమని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.డీసీఐ ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.అలాంటి సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.విశాఖలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ను గంటా ప్రారంభించారు.సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. జనసేనాని పవన్ కల్యాణ్ జనంలోకి వస్తున్నారు.ఒకవైపు విపక్షనేత జగన్‌ ప్రజల మద్దతు కోసం పాదయాత్ర చేస్తుంటే.. సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన కోసం ‘చలోరే చలోరే చల్‌’ పేరుతో పవన్‌కల్యాణ్‌ యాత్ర చేపడుతున్నారు.పలు అంశాలపై మంగళవారం ప్రకటన విడుదల చేసిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో 3 విడతలుగా పర్యటించనున్నట్లు తెలిపారు. లేఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.తొలివిడత యాత్రలో సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన చేసుకుంటానని, రెండోవిడతలో ఆయా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సరి.. లేనిపక్షంలో ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *