పవన్‌ఫై కేశినేని నాని ఫైర్

55

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరు నెలలకు ఒకసారి లేచి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడి మళ్లీ నిద్రావస్థలోకి వెళ్లి ఆరునెలల తర్వాత మళ్లి రావటం ఆయనకు అలవాటని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతామని ఆయన అన్నారు. సెక్షన్‌-8 అవసరం లేదని చెప్పడం సరికాదని కేశినేని నాని అన్నారు. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరిగిందని… కామన్‌ రాజధానిగా పదేళ్లు ఉందని, అన్ని రకాల హక్కులు హైదరాబాద్‌పై ఏపీకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. పవన్‌ తన ఆస్తులు కాపాడుకోడానికి, సినిమాలు ఆడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాకా పట్టాలని చూస్తున్నారని కేశినేని నాని విమర్శించారు. ఆర్నెళ్లకొకసారి నిద్రలేస్తే మేం ఏం చేస్తున్నామో ఎలా తెలుస్తుందని ఆయన మండిపడ్డారు. విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు రూ. 250 కోట్లు విడుదల చేశారని, ఏపీకి ప్రత్యేక హోదాపై ఏపీ ఎంపీలు పలుమార్లు పార్లమెంట్‌లో మాట్లాడారని, ఆ లిస్టు అంతా తమ వద్ద ఉందని, కేశినేని వెల్లడించారు. మిత్రపక్షంగా ఉంటూ టీడీపీ ఎంపీలపై పవన్‌ విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here