పర్యావరణ పరిరక్షణ దిశగా తొలి అడుగు

40

పర్యావరణ పరిక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ వినియోగ రహిత రాష్ట్రంగా చేయాలని తలపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ఆలోచనా విధానానికి ఈ రోజు జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకులు వేదికయ్యాయి. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగాన్ని క్రమంగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎక్కడా కూడా ప్లాస్టిక్ తో తయారు చేసిన జాతీయ పతాకం కాని, లేదా ఆహార పదార్దాల సరఫరా, వినియోగించే ప్లాస్టిక్ వస్తువులైన ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, నీళ్ళ బాటిళ్ళ విస్తృత వినియోగానికి అడ్డుకట్టవేసి మొదటి సారిగా పేపర్ డబ్బాలు, పేపర్ గ్లాసులలో మాత్రమే అల్పాహారం, పానియం వంటి ఆహార పదర్ధాలను సరఫరా చేయడం విశేషం.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు రాజ్ భవన్ లో జరిగిన అట్ హోం ( హై టీ ) కార్యక్రమంలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ వస్తువులను వినియోగించక పోవడం గమనార్హం. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న ప్రోటోకాల్ సిబ్బందిని ప్రశ్నించగా, ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని జీఏడీ ముఖ్యకార్యదర్శి శ్రీ ఆర్.పి సిసోడియా సూచనల మేరకు ఈ రోజు జరిగిన అన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ ప్లాస్టిక్ వాడాకాన్ని విరివిగా తగ్గించామని తెలిపారు. ఇదే సాంప్రదాయాన్నిఅన్ని కార్యక్రమాల్లో కొనసాగించినట్లయితే త్వరలోనే ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ ను చూడవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here